అమరావతి:గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నూరు ఎకరాల్లో బీఆర్ఎస్ మెడిసిటీ హెల్త్కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్, కృష్ణా నది మధ్య ఉన్న ద్వీ పాల్లో భారీ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన బీఆర్.శెట్టి అన్నీ దొంగ లెక్కలే చూపించారని ‘మడీ వాటర్స్’ సంస్థ అధ్యయ నంలో తేలింది.ఎన్ఎంసీ హెల్త్కేర్ పేరుతో అబుదాబీతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ శెట్టి ఆస్పత్రుల్ని ఏర్పాటు చేసారు. లండ న్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా నమోదు సంస్థ నమోదైంది.ఆయన ప్రకటిస్తున్న ఆదాయ వ్యయాలపై కన్నేసి ఉంచిన ప్రముఖ షార్ట్ సెల్లింగ్ (షేర్ల పతనంపై అంచనా వేసే సంస్థ)-కార్సన్ బ్లాక్ అసలు విషయం తేల్చాలని మడీ వాటర్స్ ను పురమాయించింది.ఇందులో విస్తు పోయే అంశా లు వెలుగు చూసాయి.బీఆర్ శెట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయారు.తన వాటా షేర్లను బ్యాంకులకు తనఖా పెట్టారు.ఇతర భాగ స్వాము లకూ వాటాలు విక్రయించారు.విదేశీ ఖాతాల్లో సంస్థలను అధిక ధరకు కొన్నట్లు,నగదు నిల్వల్ని వాస్తవాని కంటే ఎక్కువగా, వాస్తవ రుణాలు తక్కువగా ఉన్నట్లు చూపారని మడి వాటర్స్ తేల్చి చెప్పింది.ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఎన్ఎంసీ షేరు ధర సుమారు 70 శాతం క్షీణించింది. దీంతో తనఖా పెట్టిన షేర్లను ఫస్ట్ అబుదాబీ బ్యాంక్,ఫాల్కన్ ప్రైవేట్ బ్యాంకులు అమ్మే సాయి.మదుపర్లు ఆందోళన వ్యక్తం చేయ డంతో రెండు రోజుల కిందట ఛేర్మన్ పదవి నుంచి బీఆర్.శెట్టి తప్పు కున్నారు.