విఫలమైన తెదేపా ఆందోళన

విఫలమైన తెదేపా ఆందోళన

అమరావతి: రాజధాని రక్షణ పేరిట తెదేపా ప్రారంభించిన ఉద్యమం దారుణంగా విఫలమైందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు బుధవారం ట్వట్టర్లో వ్యాఖ్యానించారు. ‘ అప్పట్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైన వారంలోగానే దావానలంలా రాష్ట్రమంతా వ్యాపిం చింది. అమరావతి ఉద్యమాన్ని తెదేపా, మాధ్యమాల్లోని ఒక వర్గం జాకీలు పెట్టి లేపినా ప్రజల నుంచి స్పందన కరవైంది. ఈ విషయాన్ని భాజపా, జనసేన పార్టీలు గ్రహించాలి. రాష్ట్రంలో ఎదుగు దలకు ఇంకేదైనా కార్యక్రమాన్ని చేపట్టాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos