దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మహిళ నేత దారుణ హత్య కలకలం రేపింది. గురుగ్రామ్ బీజేపీ కిషాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మునీశ్ గోదారను ఆమె భర్త సునీల్‌కుమార్ గోదార తుపాకీతో కాల్చి హత్య చేయడం సంచలనం సృష్టించింది.గతంలో భారత సైన్యంలో విధులు నిర్వర్తించిన సునీల్ గోదార సైన్యం నుంచి విరమణ పొందిన అనంతరం కొద్ది కాలంగా ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు.2013లో బీజేపీ అనుబంధ సంస్థ ‘మహామంత్రి అనే మహిళా విభాగం’లో చేరిన మునీశ్ క్రమంగా ఎదుగుతూ.. గురుగ్రామ్ బీజేపీ కిషాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి వచ్చారు. అయితే దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.కాగా ఇతరులతో మునీశ్ వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న సునీల్ గోదార ఇదే విషయమై మునీశ్‌తో గొడవ పడుతున్నాడు.ఈ క్రమంలో తన చెల్లితో వీడియో కాల్ మాట్లాడుతుండగా ఇతరులతో మాట్లాడుతుందని భావించిన సునీల్ వెంటనే తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్‌తో కాల్పులు జరిపాడు. రౌండు రౌండ్ల కాల్పులు మునీశ్ ఛాతీపై జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.భార్యను హత్య చేసిన అనంతరం సునీల్ పారిపోగా పోలీసులు సునీల్ కోసం గాలిస్తున్నారు..