అసురన్‌తో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న తమిళ స్టార్ హీరో ధనుశ్ మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘సురులి‘ అనే చిత్రంలో ధనుశ్ నటిస్తున్నాడు.విభిన్నమైన కథాకథనాలతో వైనాట్ స్టూడియోస్,రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ గా ఈ సినిమాలో ధనుశ్ కనిపించనున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఈ నెల 19వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ధనుశ్ కి తమిళంతో పాటు తెలుగులోను మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను కూడా తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయనున్నారు. ధనుశ్ సరసన కథానాయికలుగా సంచనా నటరాజన్ .. ఐశ్వర్య లక్ష్మి కనిపించనున్నారు.