అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని తమ కర్మాగారాన్ని చెన్నైకి తరలించే యోచన ఏదీ లేదని కియా మోటార్స్ గురువారం ఇక్కడ స్పష్టీక రించింది. 110 కోట్ల డాలర్ల వ్యయంతో ఇక్కడ కట్టిన కర్మాగారాన్ని తమిళనాడుకు తరలించే యోచనలో కియా మోటార్స్ ఉన్నట్లు రాయ టర్స్ రాసిన కథనాన్ని సంస్థ ఖండించింది. ‘ఈ కథనం చూసి ఆశ్యర్యపోయాం. ఇది అత్యంత చెత్త ఊహాగానం. ఏపీలో మా ప్లాంట్ అద్భు తంగా పని చేస్తున్న సమయంలో ఇలాంటి ఊహాగానాలు రావడం ఆశ్యర్యం కలిగించింది’ అని కియా మోటార్స్ ఇండియా హెడ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) మనోహర్ భట్ అన్నారు. ప్రభుత్వం కూడా ఈ కథనాన్ని ఖండించింది. ఈ కథనం పూర్తిగా అవాస్తవమని పరిశ్రమలు, వాణి జ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ తెలిపారు.