భాజపా నేతకు తాఖీదులు

భాజపా నేతకు తాఖీదులు

న్యూ ఢిల్లీ : ఢిల్లీ శాసన సభ ఎన్నికల ప్రచారంలో మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యల్ని చేసిన భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పత్రాకు కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) గురువారం సంజాయిషీ తాఖీ దుల్ని జారీ చేసింది. ‘కశ్మీరీ పండితుల బహిష్కరణకు కారణమైన వ్యక్తు లు మీ ఇళ్లలోకి కూడా ప్రవేశించి, మిమ్మల్ని కొడతారు, ఎవరు వారు?’ అని ఆయన ఒక రాజకీయ చర్చలో చేసిన వ్యాఖ్యాలు ఎన్ని కల నియమావళికి పూర్తి వ్యతిరేకమని ఎన్నికల అధికార్లు తెలిపారు. తాఖీదుకు 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశిం చింది. సంబిత్ పత్రా వ్యాఖ్యల పూర్తి వీడియోను పంపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరింది. సంబిత్ పత్రా చేసిన వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ను ఉగ్ర వాది అని వ్యాఖ్య చేసిన లోక్సభ సభ్యుడు పర్వేష్ వర్మ ప్రచారాన్ని కూడా నిషేధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos