హామిల్టన్ : టీ20 సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న న్యూజిలాండ్ జట్టు తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నారు. కొండంత లక్ష్యాన్ని సైతం చిన్నగా మార్చేశారు. హెన్రీ, కెప్టెన్ లాథమ్‌లు అర్ధ సెంచరీలతో అదరగొట్టగా, రాస్ టేలర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 73 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదాడు. మహ్మద్ షమీ వేసిన 48.1వ బంతికి రాస్ టేలర్ (109; 84 బంతుల్లో 10×4, 4×6) సింగిల్ తీసి న్యూజిలాండ్‌కు తొలి విజయం అందించాడు. మరో 11 బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.