కూలీకి ఐటీ అధికారుల షాక్..

కూలీకి ఐటీ అధికారుల షాక్..

పన్నులు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుతో దినసరి కూలీ బెంబేలెత్తిపోయాడు.ఒడిశా రాష్ట్రంలోని నబరంగ్ పూర్ జిల్లాకు చెందిన సనధారా గంద్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2014-15లో వ్యక్తి రూ. 1.47 కోట్ల లావాదేవీలను నిర్వహించాడని నేపథ్యంలో రూ. 2.59 లక్షల పన్నును చెల్లించాలంటూ అతనికి ఇటీవల ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి.దీంతో షాక్‌ గురైన సనధారా కూలి పనులు చేసుకునే తాను మొత్తాన్ని ఎలా చెల్లించగలనని ఆవేదన వ్యక్తం చేశాడు.గతంలో తాను పప్పూ అగర్వాల్ అనే వ్యక్తి ఇంట్లో ఏడేళ్లు పని చేశానని సనధారా గంద్ తెలిపాడు. సమయంలో తన భూమి పట్టాతో పాటు తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చాననిపప్పూ యాదవ్ తనను మోసం చేశాడని వాపోయాడు. మాజీ యజమాని ఏదో చేయబట్టే తనకు నోటీసులు వచ్చాయని దీనిపై అధికారులు విచారణ చేయాలని డిమాండ్‌ చేశాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos