భారీగా పతనమైన విపణి

భారీగా పతనమైన విపణి

ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మదుపర్లను నిరాశ పరచింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బడ్జెట్ ప్రసంగం ప్రారంభానికి ముందు వరకు లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు ప్రసంగం కొనసాగుతుండగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 988 పాయింట్లు పతనమై 39,735 కి నిఫ్టీ 318 పాయింట్లు నష్టపోయి 11,661కి దిగ జారాయి. ఐటీ, టెక్ మినహా ఇతర సూచీలన్నీ నష్టాలను మూట గట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో టీసీఎస్ (4.24%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.73%), నెస్లే ఇండియా (1.68%), టెక్ మహీంద్రా (1.21%), ఇన్ఫోసిస్ (0.08%) లాభాల్ని గడించాయి. టీసీ (-6.74%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-6.18%), ఎల్ అండ్ టీ (-6.15%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.94%), ఓఎన్జీసీ (-4.68%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos