సెడాన్ పార్క్: న్యూజిలాండ్‌పై మూడో టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య చేదనలో కేవలం ఒకే పరుగు తేడాతో చతికిలపడింది. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇందులో కివీస్ 17 పరుగులు చేసింది. ఉత్కంఠ రేపిన సూపర్ ఓవర్ ఛేదనలో ఆఖరి రెండు బంతుల్ని రోహిత్ శర్మ భారీ సిక్సర్లుగా మలిచి విజయం అందించాడు. దీంతో భారత్ మరో రెండు మ్యాచులు ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. కివీస్ గడ్డపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవడం భారత్‌కు ఇదే తొలిసారు.