పచ్చ మీడియాకు విధానాలు ఉండవు

పచ్చ మీడియాకు విధానాలు ఉండవు

అమరావతి: పచ్చ మీడియాకు విధానాలు ఉండవని మంగళవారం వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి చేసిన ట్వీట్ లో విమర్శించారు. ఎల్లో మీడియాకు నిర్ధిష్ట విధానాలంటూ ఏముండవు. జాతి ఆశాకిరణం చంద్రబాబు ఏ లైన్ తీసు కుంటే దాన్ని అనుసరించడమే వాటికి తెలిసిన జర్నలిజం. అప్పట్లో కౌన్సిల్ దండగని ఎడిటోరియల్స్ రాసిన పచ్చ పత్రికలు ఇప్పుడు భిన్నంగా రాసి ‘జ్ఞానాన్ని’ వెదజల్లుతున్నాయ’న్నారు. 1983, మార్చి 28, సోమవారం ప్రచురితమైన ఈనాడు సంపాదకీయాన్ని కూడా జతపరిచారు. ఎగువ సభ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్టు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదని అందులో అభిప్రాయపడటం గమనార్హం అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos