వైద్యచరిత్రలోనే అరుదైన ఘటన..

వైద్యచరిత్రలోనే అరుదైన ఘటన..

వైద్యశాస్త్రంలోనే కాదు బాహ్యప్రపంచంలో కూడా అప్పుడప్పుడూ కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయని అప్పుడప్పుడూ జరిగే కొన్ని ఘటనలు రుజువు చేస్తుంటాయి.తాజాగా రష్యా దేశంలో చోటు చేసుకున్న ఓ ఘటన సాధారణ ప్రజలతో పాటు వైద్యులను కూడా ఆశ్చర్యనపరచింది.రష్యాలోని ఇజ్లుచిన్క్స్‌ పట్టణంలో ఓ అపార్ట్‌మెంట్‌లో తొమ్మిదో అంతస్తులో ఉంటున్న ట్రావెల్‌ ఓ మహిళ యథాలాపంగా బాల్కనీలో నిల్చుంది.అయితే ప్రమాదవశాత్తు పట్టుతప్పి అమాంతం అంతపై నుంచి కిందకు పడిపోయింది.అయితే పశ్చిమ సైబీరియాలోని ఇజ్లుచిన్స్క్  పట్టణంలో ప్రస్తుతం మైనస్ 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎముకలు సైతం గడ్డకట్టే చలికి భారీగా కురుస్తున్న మంచుపై ట్రావెల్ పడడంతో ఎలాంటి గాయాలు కాలేదు. కానీ పైనుంచి పడడం వల్ల అదరడంతో ఆమె నరాలు కొంచెం ఒత్తిడికి లోనుకావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. అయితే మంచుకుప్ప పై పడిన మహిళకు పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ఒక్క ఎముక కూడా విరిగకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెడికల్ హిస్టరీలోనే ఇదో అరుదైన ఘటనగా అభివర్ణించారు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos