క్రూరాతిక్రూరంగా నాని..

  • In Film
  • January 28, 2020
  • 170 Views
క్రూరాతిక్రూరంగా నాని..

భిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్నవిచిత్రం అంచనాలు ఓ స్థాయిలోనే ఉన్నాయి.సుధీర్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా హీరో నాని చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. కెరీర్‌లో మొదటిసారి పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో నాని కనిపించనుండడంతో చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.చిత్రంలో సుధీర్ పాత్ర రక్షకుడిగా ఉంటుందనీ, నాని పాత్ర రాక్షసుడిగా ఉంటుందని ముందుగానే తెలియజేశారు. అలాగే రక్షకుడిగా నిన్న సుధీర్ బాబు పోస్టర్ ను వదిలారు. లుక్ మంచి మార్కులను కొట్టేసింది.ఇక రాక్షసుడిగా రోజున నాని ఫస్టులుక్ ను వదిలారు. రక్తం మరకలు అంటిన కత్తెరను చేతిలో పట్టుకున్న నాని, దుర్మార్గపు ఆలోచన ఏదో ఆచరణలో పెట్టినట్టుగా కనిపిస్తున్నాడు. నాని లుక్ తో సినిమాపై అంచనాలు,ఆసక్తి రెట్టింపయ్యాయి.దిల్రాజు నిర్మిస్తున్న సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చాడు. నివేదా థామస్,అదితీరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్న సినిమాను మార్చి 25 తేదీన విడుదల చేయనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos