కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా రెపరెపలాడింది. నగర పాలక సంస్థలో మొత్తం 60 డివిజన్లు ఉండగా, మేయర్ పీఠానికి అవసరమైన స్థానాలను గెలుచుకుని తెరాస జయభేరి మోగించింది. 13 డివిజన్లలో గెలుపొంది భాజపా రెండో స్థానంలో నిలిచింది. తెరాస మిత్రపక్షం ఎంఐఎం ఏడు డివిజన్లలో గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇతరులు ఏడు చోట్ల గెలుపొందారు. పురపోరులో మొత్తం 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, పదింటినీ తెరాసనే కైవసం చేసుకుంది.