మండలి రద్దుకు శాసన సభ ఆమోదం

మండలి రద్దుకు శాసన సభ ఆమోదం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ తెలిపారు. సోమవారం ఉదయం మండలిని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి, దానిని సీఎం జగన్‌ శాసనసభ ముందు ఉంచారు.  దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. చర్చలో భాగంగా మండలి రద్దు తీర్మానంపై ప్రసంగించిన సీఎం జగన్‌, దీనికి ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. అనంతరం సభలో ఓటింగ్‌కు పెడుతున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ముందుగా సభలో సభ్యులు కాని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లను పక్కకు కూర్చోవాలని సూచించారు. అనంతరం సభలో చేపట్టి, ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos