బెంగళూరు : తుమ్కురు సిద్ధగంగా మఠాధిపతి శివ కుమారస్వామిజీ(111) శివక్యైం చెందారు. లింగాయత్ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా పూజించే శివకుమార స్వామి అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల స్వామికి డిసెంబరు 8వతేదీన వైద్యులు ఆపరేషన్ చేశారు. అయినా స్వామిజీ ఆరోగ్యం కుదటపడలేదు. గత 15రోజులుగా ఆయన వైద్యుల సమక్షంలోని చికిత్స పొందారు. ఇక స్వామిజీ ఆరోగ్య పరిస్థితిపై గత మూడు రోజులుగా గోప్యత పాటించిన అధికారులు.. సోమవారం 11.44 నిమిషాలకు తుదిశాస్వ విడిచారని ప్రకటించారు. ఇక స్వామిజీ మృతిపై కర్ణాటక సీఎం కుమారస్వామి సంతాపం తెలిపారు. స్వామిజీ మరణవార్తతో అధికారులు మఠం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది సంఖ్యలోని ఆయన భక్తులు స్వామిజీ కడచూపు కోరకు అక్కడికి చేరకుంటున్నారు.మంగళవారం సాయంత్రం శివకుమార స్వామిజీ అంతి సంస్కారాలు జరగనున్నాయి. స్వామిజీ మృతికి సంతాపంగా కర్ణాటక ప్రభుత్వం రేపు సెలవుదినంగా ప్రకటించింది. నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన శివకుమారస్వామిజీ అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ సిద్ధగంగా ఎడ్యూకేషన్ సొసైటీ పేరిట 125 విద్యాసంస్థలను నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో స్వామిజీకి పద్మభూషణ్ అవార్డును అందజేసింది. ఇక ఉదయం స్వామిజీ ఆరోగ్యం విషమించిందని అధికారులు ప్రకటించడంతో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరలు తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని మరి మఠానికి వచ్చారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు కూడా ప్రకటించారు.శివకుమారస్వామిని ‘నడిచే దేవుడి’గా ఆయన ఆరాధకులు పిలుచుకుంటారు. 12శతాబ్దంలోని సంఘసంస్కర్త బసవ రూపంలో జన్మించిన అవతారమూర్తిగా కీర్తిస్తుంటారు. లింగాయత్‌లకు ఆరాధకుడైన ఆయన సిద్దగంగ విద్యాపీఠానికిఅధిపతిగానూ ఉన్నారు. ఈ విద్యాపీఠం కింద 125 అనుబంధ విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలలు కొనసాగిస్తున్నారు. ఇందులో చదువుకొంటున్న పేద విద్యార్థులకు ఉచితవిద్యతోపాటు, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, సదానంద గౌడ తదితర రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తడంతో గత కొన్నివారాలుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన శివైక్యం చెందారన్న సమాచారం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున మఠానికి తరలివస్తున్నారు. దీంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని వీరపుర గ్రామంలో 1907 ఏప్రిల్ 1న శివకుమారస్వామి జన్మించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మానవతావాదిగా పేరుతెచ్చుకున్నారు. 2015లో ఆయన పద్మభూషణ్ అందుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వాలని గతవారమే కర్ణాటక సీఎం కుమారస్వామి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

