నాదస్వరంతో మరింత మధురంగా సామజవరగమన..

  • In Film
  • January 23, 2020
  • 135 Views
నాదస్వరంతో మరింత మధురంగా సామజవరగమన..

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన అల్లు అర్జున్‌ నటించిన అలవైకుంఠపురములో చిత్రం భారీ వసూళ్లతో అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అత్యంత పెద్ద విజయంగా దూసుకెళుతోంది.ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నాన్‌ బాహుబలి రికార్డుల దిశగా దూసుకెళ్లిన అల విదేశాల్లో సైతం టాప్‌ 5లో నిలిచింది.ఇక ఈ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించడంలో థమన్‌ అందించిన సంగీతం కూడా కీలకపాత్ర పోషించింది.ముఖ్యంగా సామజవరగమన,రాములో పాటలు యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టించాయి.ఎవరి మొబైల్‌లో చూసినా ఇదేపాటు మారుమోగుతున్నాయి. చివరకు భాష తెలియని రాష్ట్రాల్లో సైతం ఇదే పాటలు వినిపిస్తుండడం విశేషం.ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రోజున ఎద్దుతో అన్ని ఇళ్లు తిరిగే సన్నాయి బవసన్న నాదస్వరంతో వినిపించిన సామజవరగమన విపరీతంగా ఆకట్టుకుంటోంది.నాదస్వరంలో సామజవరగమన మరింత వినసొంపుగా ఉంది.అందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos