బెంగళూరు: ‘చంద్రయాన్-3 మిషన్ పనులు ప్రారంభమయ్యాయి. పూర్తి వేగంతో కొనసాగుతున్నాయ’ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అధ్యక్షుడు శివన్ వెల్లడించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘జాబిల్లి మీదకు మనిషని ఏదో ఒక రోజు పంపించి తీరుతామ’ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను అమర్చాం. చంద్రయాన్-3లో ల్యాండర్‌తో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన రోవర్ ఉంటుంది. సంబంధిత పనులు సజావుగా సాగుతున్నాయ’న్నారు. చంద్రయాన్-3 ల్యాండర్ నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లు, ప్రయోగానికి రూ. 350 కోట్ల వరకూ ఖర్చవుతుందన్నారు.