జాగ్వార్ అనే భారీ బడ్జెట్ చిత్రంతో తెలుగు-కన్నడ చిత్రపరిశ్రమలకు ఒకేసారి పరిచయమైన కర్ణాటక మాజీ సీఎం తనయుడు నిఖిల్ గౌడ జాగ్వార్ చిత్రం డిజాస్టర్ కావడంతో అనంతరం కేవలం కన్నడ పరిశ్రమకే పరిమితమయ్యాడు.కన్నడలో పలు చిత్రాల్లో నటించిన నిఖిల్ తెలుగులో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు మాత్రం వదులుకోలేదు.తాజాగా ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ రోజు నిఖిల్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ప్రకటన వచ్చింది.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో నిఖిల్ ఒక స్పోర్ట్స్ జెర్సీ ధరించి బాస్కెట్ బాల్ పోస్ట్ దగ్గర నిలుచున్నాడు. గోల్ కొట్టిన వారు సంతోషం వ్యక్తం చేసినట్టుగా రెండు చేతులో చాపి నిలుచున్నాడు. ఈ సినిమాతో లహరి మ్యూజిక్ వారు సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని సమాచారం. కన్నడ–తెలుగు ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది..