ఆర్‌ కృష్ణయ్య పిటిషన్ తిరస్కరణ

  • In Local
  • January 21, 2019
  • 1032 Views
ఆర్‌ కృష్ణయ్య పిటిషన్ తిరస్కరణ

పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ రద్దు చేయాలని ఆర్‌ కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ బిసి రిజర్వేషన్లను 34% నుంచి 22%కు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు న్యాయవాదిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.. 50 శాతం నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos