ప్రధానమంత్రి నరేంద్రమోదీ అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ నేత పురందేశ్వరి కొనియాడారు. సోమవారం విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలోని ప్రతి పథకంలోనూ అవినీతి పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. ఇప్పుడు ఏపీ ప్రజలు నీతివంతమైన పాలన ఆశిస్తున్నారని పురందేశ్వరి అన్నారు.