ఆరంభం కాని అభివృద్ధి పనులు

నాగపూర్:‘ప్రభుత్వానికి సానుకూల దృక్ఫథం, నిర్ణయాత్మక శక్తి అవసరం. నిధులున్నా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంద’ని నాగపూర్ లోక్ సభ సభ్యుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ జరిగిన ‘ఖాస్దర్ క్రీడా మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైదానంలో ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడారు.అనంతరం ప్రసంగించారు. ‘గత ఐదేళ్లలో రూ.17 లక్షల కోట్ల వ్యయమయ్యే పనుల్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏడాది కనీసం రూ.5 లక్షల కోట్లు వ్య య మ య్యే పనుల్నీ ఆరంభించలేదు. నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవటమే ఇందుకు కారణం. నిధుల కొరత లేదు. ఉన్న సమస్య నెగటివ్ దృక్ఫథం వల్ల ప్రభుత్వంలో నిర్ణయాలు చేసే శక్తి లోపించడమేన’ని విశ్లేషించారు. నిర్ణయాలు తీసు కోవ డంలో ఐఏఎస్ అధికారులు ముఖ్య పాత్ర నిర్వహించాలి. ప్రభుత్వం ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడంలో వారి పాత్ర కీలకమని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos