ముంబై: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గు ముఖం పట్టటంతో స్టాక్ మార్కెట్ కుదురుకుంది. సోమవారం ఉదయం 9.45 గంట ల వేళకు సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంతో 41,840 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 12,324 వద్ద నిలిచాయి. డాలర్తో రూ పాయి మారకం విలువ 70.84గా దాఖలైంది. ఇన్ఫిసిస్, టాటాస్టీల్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా లాభాల్లో ఉన్నాయి.