పిల్లల ఆకలి తీర్చడానికి తల్లి సాహసం..

పిల్లల ఆకలి తీర్చడానికి తల్లి సాహసం..

పిల్లల కోసం తల్లి ఎంతకైనా తెగిస్తుందని ఏ త్యాగానికైనా సిద్ధపడుతుందనే నిజం తమిళనాడుకు చెందిన ఓ మహిళ మరోసారి ప్రపంచానికి రుజువు చేసింది.పిల్లల ఆకలి తీర్చడానికి రూ.150లకు తన కురులు విక్రయించి తల్లిహృదయానికి అర్థం చెప్పింది.సేలం ప్రాంతానికి చెందిన ప్రేమకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో చాలా కాలం క్రితం వివాహమైంది.అయితే వ్యక్తిగత కారణాలతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసిన ప్రేమ భర్త వాటిని తీర్చలేక రుణదాతల ఒత్తిళ్లు తాళలేక కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో ముగ్గురు పిల్లలతో ప్రేమ రోడ్డున పడింది.పిల్లలను ఎలా పోషించాలో తెలియక సతమతమైంది.ఎక్కడా ఉద్యోగం లభించకపోవడంతో పిల్లల పోషణ భారమైంది.ఈ నేపథ్యంలో పిల్లలు ఆకలితో అలమటిస్తుండడాన్ని చూడలేక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.గుండు చేయించుకుంటే రూ.150లు ఇస్తామని కొంతమంది చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గుండు చేయించుకుంది.ప్రేమ శిరోజాలు సేకరించిన వ్యక్తులు రూ.150లు ఇవ్వగా అందులో పిల్లల కడుపు నింపి మిగిలిన డబ్బుతో పురుగుల మందు కొని పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన స్థానికులు వెంటనే ప్రేమను రక్షించి ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన మొత్తాన్ని బాలా అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో స్పందించిన నెటిజన్లు ప్రేమకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos