అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైన తన కూతురికి న్యాయం జరిగే వరకు ఏళ్ల తరబడి పోరాడి చివరకు విజయం సాధించిన నిర్భయ తల్లి ఆశాదేవి వచ్చేనెలలో ఢిల్లీలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.నిర్భయ ఘటనకు సంబంధించి అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించిన ఆశాదేవి ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం తథ్యమని భావించిన పార్టీలు ఆశాదేవికి టికెట్ ఇవ్వడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని ఇప్పటికే ఆశాదేవితో ఆయా పార్టీల కీలకనేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.దీనిపై ఆశాదేవి స్పందిస్తూ..ముందు నలుగురు రాక్షసులు ఉరికొయ్యకు వేలాడే దృశ్యాన్ని చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు.నిందితులకు ఉరిశిక్ష విధించిన అనంతరం ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఆలోచిస్తామన్నారు.బీజేపీతో పాటు అరవింద కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ కూడా ఆశాదేవితో పలు దఫాలుగా రహస్యంగా చర్చించినట్లు తెలుస్తోంది..