హింసాకాండ సీసీటీవీ ఫూటేజీలను భద్ర పరచండి

హింసాకాండ సీసీటీవీ ఫూటేజీలను భద్ర పరచండి

న్యూఢిల్లీ: జవాహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం ఆవరణలో గత ఆదివారం వ్యూహాత్మకంగా జరిగిన హింసాకాండ సీసీటీవీ ఫూటేజీలను భద్రపరచాలని ముగ్గురు ఆచార్యులు శుక్రవారం ఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. హింసాకాండ పై ఇక్కడి ఢిల్లీ పోలీసులకు మరో మూడు ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ వ్యాజ్యం దాఖలు కావడం గమ నార్హం. పోలీసులకు అందిన ఫిర్యాదుల సంఖ్య 14కి చేరింది. హింసాకాండ వీడియోలతో తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 12 మంది వాంగ్మూలాలిచ్చారు. సర్వర్ ధ్వంసమైనందున సీసీటీవీ ఫూటేజీలు అందు బాటు లో లేవని క్రైమ్ బ్రాంచి పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos