ముంబై: న్యూఢిల్లీ లోని జవాహర్లాల్ విశ్వ విద్యాలయం లో గత ఆది వారం హిందు ముష్కర మూకల దాడిలో గాయపడిన విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషా ఘోష్‌ను పరామర్శించిన నటి దీపికా పడుకోనేను విఖ్యాత ప్రతి నాయకుడు అనురాగ్ కశ్యప్ గురువారం అభినందించారు. ఆమె చర్యను గట్టిగా సమర్థించారు. దీపిక ప్రదర్శించిన ధైర్యానికి ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసిం చాలన్నాడు. ‘ఐషీ ఘోష్ ఎదుట చేతులు జోడించి నిల్చున్న దీపిక ఫొటో ప్రతీ ఒక్కరికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అది కేవలం దీపిక ప్రకటించిన సంఘీభావం మాత్రమే కాదు. నీ బాధను నేను కూడా అనుభవిస్తున్నాను అని చెప్పడం. ఆమె చర్య ఎందరికో ధైర్యాన్నిచ్చింది. భయం లేకుండా జీవించాలని చెప్పింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భయాందోళనలు నెల కొన్నా యి. దీపిక జేఎన్యూకు వెళ్లి ఆ భయాన్ని జయించింది. అందుకే తన పేరు మారు మోగిపోతుంది. ఆమె ఇచ్చిన స్పూర్తితో భయంతో విసుగెత్తిపోయిన ప్రజలు భయాన్ని దాటి దాటుకుని ముందుకు సాగుతార’ని పేర్కొన్నాడు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దీపిక నిర్మాత. ప్రచార ఎత్తుగడగా ఆమె ఐషాను పరామర్శించారని సామాజిక మధ్యమా ల్లో ఎగతాళి చేస్తున్నారు.‘అది ప్రచార ఎత్తుగడా, లేదా మరొకటి అయితే ఏంటి? ఈ వ్యాపారంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ ఇలాగే మాట్లాడతారు. ముఖ్యంగా నువ్వు ఈ సినిమాకు ఓ నిర్మాతకు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తారు. అయినా పర్లేదు’ అని సాంత్వన పలికారు.