ముంబై:‘ఫ్రీ కశ్మీర్ అంటే ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత కశ్మీర్ అని నా ఉద్దే శం. జాతి సమైక్యత, సమగ్రతల్ని దెబ్బతీయటం నా ఉద్దేశం కాదు. దీన్ని అర్థం చేసుకోకుండా 153బీ కింద కేసు నమోదు చేసి వేధించడం అన్యాయం’ అని స్థానిక రచయిత్రి మెహక్ మీర్జా ప్రభు ఆక్రోశించారు. జవాహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయ ఆవరణలో జరి గిన అమానుష చర్యలకు నిరసనగా ఇక్కడి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆమె ఫ్రీ కశ్మీర్ నినాదాన్ని రాసిన అట్టముక్కను ప్రదర్శించారు. ఇది వి వా దస్పదమైంది. ‘ఆ రోజు రాత్రి 7.30 గంటల సమయంలో నేను గేట్ వే వద్దకు వెళ్లాను. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపి వే య డంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది వారి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేన న్నది నా భావ న. అక్కడ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని తెలప దలచుకున్నా. అప్పుడు అక్కడ కనిపించిన ఫ్రీ కశ్మీర్ నినాదం ఉన్న అట్ట ముక్క నన్ను ఆకర్షించింది. దీంతో దాన్ని చేతుల్లోకి తీసుకుని అనాలోచితంగా ప్రదర్శించాను అంతే’ అని విపులీక రించా రు.