ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలి

ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలి

న్యూఢిల్లీ: అమెరికా దాడిలో మృతి చెందిన ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సులేమానీ సంతాప సభ ఇక్కడి ఇరాన్ దౌత్య కార్యాలయంలో బుధవారం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఇరాన్ రాయబారి అలీ చెగేని విలేఖరులతో మాట్లాడారు.‘ ప్రపంచ వ్యాప్తం గా శాంతి నెలకొల్పడంలో భారత్ చాలా గొప్ప పాత్ర పోషిస్తోంది. భారత్ ఆసియా ప్రాంతానికి చెందినదే. ప్రస్తుత పరిస్థి తుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇతర దేశాలు ఎలాంటి చర్యలు చేపట్టినా స్వాగతిస్తాం. ముఖ్యంగా మా మిత్రదేశమైన భారత్ ఎలాం టి చర్యలు చేపట్టినా స్వాగతిస్తాం. మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు. ప్రతి ఒక్కరి శాంతి, శ్రేయస్సునే కోరుకుంటున్నాం. ఆత్మ రక్షణ హక్కుల కిందే అమెరికాపై మా దేశం ప్రతిచర్యకు దిగిందన్నా’రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos