వివాదాస్పద వ్యాఖ్యలు,చర్యలతో ఇంటా బయట చివాట్లు తినే అలవాటున్న పాకిస్థాన్ మంత్రి ఫవాద్‌ఖాన్ మరోసారి వివాదాస్పద రీతిలో వార్తల్లో నిలిచాడు.టిక్‌టాక్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటి హరీమ్ షాతో తనకు సంబంధం అంటగట్టిన యాంకర్ ముబాషెహర్ పై పాక్ మంత్రి ఫవాద్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ వివాహ వేడుకలో యాంకర్ ను చూసి అతడిపై చేయి చేసుకున్నారు.టీవీ యాంకర్ చెంప చెళ్లుమనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.ముబాషెహర్ ఓ టీవీ కార్యక్రమం చేస్తూ.. మరో యాంకర్ తో మాట్లాడుతూ.. టిక్ టాక్ స్టార్ హరీమ్ షాతో మంత్రి చౌదరి ఉన్న అసభ్య వీడియోలను చూశానన్నారు. దీన్ని చూసిన మంత్రి యాంకర్ ముబాషెహర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.తాజాగా ఓ వివాహ వేడుకలో సదరు యాంకర్ ను చూసి కోపం పట్టలేక చెంప పగులగొట్టాడు.ఈ విషయంపై మంత్రి చౌదరి ట్విట్టర్ మాధ్యమంగా స్పందించాడు. ‘పదవులు ఉండవచ్చు పోవచ్చు, కానీ మనము మనుషులం. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు స్పందిస్తాం. వ్యక్తి గత ఆరోపణలు చేస్తే సహించేది లేదు’ అని పేర్కొన్నాడు. యాంకర్ ముబాషెహర్ ఓ నకిలీ పాత్రికేయుడని తెలిపాడు. ఇలాంటి వారు జర్నలిజం విలువలను కాలరాస్తున్నారని విమర్శించాడు. ఇలాంటివారి విషయాలను బహిర్గతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నాడు.