కొచ్చి:ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి అలెగ్జాండర్ పై మంగళవారం ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు దాడి జరిపి గాయపరిచారు. ఆయన ప్రయాణించిన కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద రాళ్లు విసిరారు. గాజు కిటికీలు పగిలి పోయాయి. లోపల ఉన్న ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కారు ధ్వంసమైంది. మరో కారులో వచ్చిన సిబ్బంది జార్జి అలెగ్జాండర్ ను ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా సంస్థ ఉద్యోగులకు, యాజ మాన్యాల మధ్య విభేదాలు రగులుతున్నాయి. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనలు, ధర్నాలు చేపట్టిన ఉద్యోగుల్లో కొందరిపై వేటు వేసింది. తమ సంస్థ ఉద్యోగులు సీఐటీయూ కార్మిక సంఘంతో సఖ్యతగా ఉండడం కూడా ముత్తూట్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ కు రుచించడంలేదు.