నిర్మాణ రంగంలోకి అలీ..

  • In Film
  • January 5, 2020
  • 156 Views
నిర్మాణ రంగంలోకి అలీ..

బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్దాలుగా ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్న అలీ తాజాగా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నూతన సంవత్సరం సందర్భంగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఇతర బ్యానర్లకు భిన్నంగా తన నిర్మాణ సంస్థ పేరునుఅలీవుడ్ ఎంటర్టయిన్మెంట్స్‌గా ప్రకటించారు. తన పేరు కలిసొచ్చేలా నామకరణం చేశారు. బ్యానర్ ద్వారా వెబ్ సిరీస్‌లు, వాణిజ్య ప్రకటనలు, టీవీ సీరియళ్లు,ఎంటర్టయిన్మెంట్ షోలు నిర్మించాలన్నది అలీ ఆలోచన. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ కార్యకలాపాలు ఉంటాయట. హైదరాబాదు శివార్లలోని మణికొండలో ఉన్న తన నివాసానికి దగ్గర్లోనేఅలీవుడ్ ఎంటర్టయిన్ మెంట్స్కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు అలీ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos