నగుబాట్ల పాలైన కిరణ్‌ బేడి

నగుబాట్ల పాలైన కిరణ్‌ బేడి

పుదుచ్చేరి: నకిలీ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించి ఎగతాళికి గురయిన వారి పట్టికలో పుదుచ్చేరీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా చేరారు. ‘సూర్యుడు ఓంకారం పలుకుతున్నాడు. ఆ వీడియోను నాసా రికార్డు చేసింద’ని కిరణ్బేడీ శనివారం ట్విటర్లోకి ఒక వీడియోను ఎక్కించారు. వాస్తవానికి ఇది స్వచ్ఛమైన నకిలీ వీడియో. ‘సూర్యుడి శబ్దాలను నాసా రికార్డు చేసింది నిజమే. వాటిలో ఓంకారం వినిపించదని ఆ రికార్డ్ను నాసా ఇది వరకే యూట్యూబ్లో పోస్ట్ చేసింది. దీన్ని గుర్తిం చని కిరణ్బేడీ నకిలీ వీడియోను ట్విటర్లో ఎక్కించారు. అంతే నెటిజన్లు అసలైన నాసా వీడియోను పోస్ట్ చేసి కిరణ్ బేడీని ఎగతాళి చేసారు. ‘మేడమ్. అసలైన వీడియో ఇది. మాజీ ఐపీఎస్ అధికారి, ఒక రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్. ఇలాంటి వాటిని నమ్ముతారా? చాలా మందికి స్ఫూర్తినిచ్చే మీలాంటి వారు ట్వీట్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని సున్నితంగా చీవాట్లు పెట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos