హైదరాబాదు: ‘కేటీఆర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ ముఖ్యమంత్రి కాలేడ’ని తెలంగాణ భాజపా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.‘రాహుల్ గాంధీ విషయంలో సోనియా చేసిన తప్పును కేసీఆర్ చేయదల్చుకోలేదు. అందుకే పురపాలక ఎన్నికలు పూర్తయిన తర్వాత కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయించారు. మున్సిపల్ ఎన్నికల తేదీల వెనుక ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుట్ర ఉంద’న్నారు.