అమ్మాయిల వేషంలో అబ్బాయిలు

అమ్మాయిల వేషంలో అబ్బాయిలు

పుణే :ఇక్కడి ప్రఖ్యాత పెర్గూసన్ కళాశాల విద్యార్థులు ముగ్గురు కళాశాల వార్షికోత్సవంలో చీరలు కట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. లింగ సమానత్వం గురించి సందేశాన్ని ఇచ్చేందుకు ఈ వేషధారణ అని చెప్పారు. కళాశాల వార్షికోత్సవంలో ఏదో ఒక ఇతి వృత్తం దుస్తుల్ని ధరించటం విద్యార్థుల ఆనవాయితి. ఈ ఏడాది అది-టై అండ్ శారీ. డే విద్యార్థులందరు తమకు నచ్చిన వస్త్రధారణలో వచ్చారు. మూడో సంవత్సరం చదువుతున్న ఆకాశ్ పవార్, సుమిత్ హోన్వాడజ్కర్, రుషికేష్ సనాప్లు చీరలు ధరించి వచ్చారు. వారి వేషధారణను చూసి మొదట అందరూ నవ్వుకున్న విషయం తెలిసిన తర్వాత వారితో ఫోటోలు దిగేం దుకు ఎగబడ్డారు. ‘ఆడవారు చీరలు,సల్వార్, కుర్తాలు ధరించాలని, మగవారు షర్ట్, ప్యాంట్ మాత్రమే వేసుకోవాలని ఎవరు ఎక్కడా చెప్పలేదు. అందుకే ఈ సారి వినూత్నంగా ప్రయత్నించాలనే చీరలు కట్టుకొని వెళ్లాం. అంతేకాదు లింగ సమాన త్వం గురించి చెప్పాలని అనుకున్నామని’ఆకాశ్ పవార్ పేర్కొన్నాడు. చీర కట్టుకునేటపుడు ఇబ్బంది పడ్డాను.పదే పదే చీర జారి పడింది. దీంతో మా స్నేహితురాలు శ్రద్ధ సాయం తీసుకున్నాం. ఆడవాళ్లు మేకప్కు ఎందుకంత సమయం తీసుకుంటారో నాకు ఇప్పుడర్థమయింద’న్నాడు సుమిత్. వారి సాహసాన్ని కళాశాల నిర్వాహకులు ప్రశంసించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos