లొంగి పోయిన దివాకరుడు

లొంగి పోయిన దివాకరుడు

అనంతపురం: పోలీసులతో బూట్లు నాకిస్తానని ఇటీవల వ్యాఖ్యా నిం చిన తెదేపా లోక్సభ మాజీ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి శనివారం ఇక్కడి గ్రామీణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ చేసిన ఫిర్యాదు మేరకు దివాకర రెడ్డికి వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర పోలీసులకు జేసీ దివారక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కడప జిల్లా పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా వారిపై గంజాయి కేసులు పెట్టిస్తామని, లేకుంటే సారా కేసులు పెట్టిస్తామనీ నోరు పారేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos