పెరిగిన ఆధునిక సాంకేతికత మహిళల పాలిట శాపంగా పరిణమించింది.ఉప్పెనలా దూసుకువస్తున్న కొత్త యాప్‌లు,సాంకేతికతతో మహిళలను ముఖ్యంగా సెలబ్రిటీలను వేధిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.తాజాగా ప్రముఖ గాయని కౌసల్య సైతం సామాజిక మాధ్యమాల్లో వేధింపులు తీవ్రతరమయ్యాయి. అసభ్య పదజాలంతో సందేశాలు పంపడం లాంటి వాటితో విసిగెత్తి పోయినట్టు సమాచారం. ఆకతాయిల చేష్టలకు విసిగి వేసారిన కౌసల్య దాదాపు 342మందిని బ్లాక్ చేశానని వెల్లడించారు.సింగర్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సంగీతమే ప్రధానంగా సాగే ఓ వెబ్ సిరీస్‌లో కౌసల్య నటించబోతోన్నట్లు తెలుస్తోంది.అయితే కొద్ది రోజులుగా కొంతమంది పదేపదే అశ్లీల ఫోటోలు,వీడియోలు,అసభ్య పదజాలాలతో వేధిస్తున్నారంటూ కౌసల్య వాపోయారు.