ఊరూరా ఆగే ఎక్స్ ప్రెస్ బస్సులు

ఊరూరా ఆగే ఎక్స్ ప్రెస్  బస్సులు

ఉదయగిరి: సహజంగా ఎక్స్ప్రెస్ బస్సులు కొన్ని చోట్ల మాత్రమే ఆగుతాయి . ఉదయగిరి-నెల్లూరు బస్సులు చెయ్యి ఎత్తితే  ఆగిపోతాయి. ఉదయగిరి నుంచి ఆత్మకూరు వెళ్లే వరకు ఒక్క పల్లెను వదలకుండా ఆగుతాయి. మరి ఇవేమీ ఎక్స్ప్రెస్ బస్సులు అంటారా ? అదే ఉదయగిరి డిపో ప్రత్యేకత. ఉదయగిరి నుంచి ఆత్మకూరు వెళ్లే వరకు ప్రతి పల్లెలో ఆగినా, కచ్చితంగా ఎక్స్ప్రెస్ ఛార్జి చెల్లించాల్సిందే .ఇది ఎలా సాధ్యం అని ఎవరైనా విస్తు  పోతారు.  ఉదయగిరి డిపో అధికారులు మాత్రం ప్రయాణికుల నుంచి ఎక్స్ప్రెస్ ఛార్జి చార్జిని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. గతంలో ఇవి పాసింజర్ బస్సులే. ఆ తర్వాత నెల్లూరు పాలెం మీదుగా ఆత్మకూరు కు వెళ్లకుండా  నెల్లూరు  వెళ్లడం ప్రారంభించాయి. దీన్ని అలుసుగా తీసుకున్న అధికారులు వీటిని  ఎక్స్ప్రెస్ గా పేరు మార్చారు. అంతటితో ఆగకుండా చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. తమాషా ఏమిటంటే ఇవే బస్సులు నెల్లూరు పాలెం నుంచి నెల్లూరు వరకు కొన్ని స్టాపుల్లో మాత్రమే ఆగి వెళ్తాయి. ఆత్మకూరు -ఉదయగిరి మార్గంలో మాత్రం ఇవి ప్రతీ చోటా ఆగి ,సాగుతాయి. అసలే పెరిగిన చార్జీల దృష్ట్యా  వీటిని సెమీ  ఎక్ష్ప్రెస్స్ బస్సులు గా పరిగణిస్తే కొంతలో కొంత ఛార్జీలైన తగ్గుతాయి. అధికారులు దీన్ని పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదు వీటిని ఎక్స్ప్రెస్ బస్సులు గా కొనసాగించాలి అనుకుంటే పల్లె ప్రాంతాలకు తెలుగు వెలుగు బస్సు లైనా ఏర్పాటుచేసి ఆత్మకూరు వరకు నడిపితే లిమిటెడ్ స్టాప్ లతో ఈ బస్సులు కొనసాగించవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos