ఏలూరు: తమకు మూడు ప్రాంతాలూ సమానమే అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. శుక్రవారం ఇక్కడ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ప్రసంగించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్నాయనే సంకేతాలను మరోసారి ఇచ్చారు. ‘ అన్ని ప్రాంతాలకు మేలు చేసేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. గత ప్రభుత్వం కొందరికే న్యాయం చేసింది. ఆ ప్రభుత్వం చేసిన అన్యా యాలను సరిదిద్దుతాం. అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేలా చూస్తాం. అందరి అభివృద్ధి కోసం సరైన నిర్ణయాలను తీసు కుని పాలన సాగిస్తాం. దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధి కోసం ఉపయోగిస్తామ’ని పేర్కొన్నారు.