మనుషులను చూసి నేర్చుకుందో ఏమో కానీ ఓ మగపులి తన మాట వినలేదని ఓ ఆడపులిని దారుణంగా చంపేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ బయోలాజికల్ పార్క్‌లో దామిని అనే ఆడపులి, కుమార్ అనే మగపులి ఉన్నాయి. కుమార్ చాలా దూకుడుగా ప్రవర్తిస్తుండగా దామిని చాలా సౌమ్యంగా ఉండేది.దీంతో కుమార్‌ను ఆడపులి పక్కనే ఉన్న స్పెషల్ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు.ఈ క్రమంలో రెండు పులుల మధ్యా ఏం జరిగిందో ఏమోగానీ, అడ్డుగా ఉన్న వైర్లను తెంపిన కుమార్, బలవంతంగా దామిని ఉన్న ఎన్ క్లోజర్ లోకి వచ్చింది. బలమైన ఇనుప తీగలను తెంపిన క్రమంలో కుమార్‌కు గాయాలు అయ్యాయి. ఆపై ఆడపులి దామిని పీక కొరికిన కుమార్ దామినిని హతమార్చింది. ఈ విషయాన్ని వెల్లడించిన పార్కు అధికారి జీవీ రెడ్డి, ఆడపులి కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు తెలిపారు.