కేఎన్‌ దొడ్డి పంచాయతీ అధ్యక్షురాలుగా బీబీఏ విద్యార్థిని

కేఎన్‌ దొడ్డి పంచాయతీ అధ్యక్షురాలుగా బీబీఏ విద్యార్థిని

హొసూరు : ఇక్కడికి సమీపంలోని బేరికె వద్ద గల కాటినాయకన దొడ్డి (కేఎన్‌ దొడ్డి) పంచాయతీ అధ్యక్షురాలుగా బీబీఏ విద్యార్థిని సంధ్యారాణి

ఎన్నికైంది. ఆమె తన  సమీప ప్రత్యర్థిపై 210 ఓట్ల తేడాతో గెలుపొందింది. అతి చిన్న వయసులోనే ఆమె అధ్యక్షురాలుగా ఎన్నిక కావడంతో

గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నిక ఫలితం వెలువడగానే గ్రామస్థులందరూ ఆమెను అభినందిస్తూ, మేళ తాళాలతో ఊరేగింపుగా

తీసుకెళ్లారు. మహిళలు ఆమెకు హారతులిచ్చి దీవించారు. చిన్న వయసులోనే ఆమె చరిత్ర సృష్టించారని, కేఎన్‌ దొడ్డిలో ఇదో చారిత్రక ఘట్టమని గ్రామస్థులు కొనియాడారు. ఆమె తండ్రి సారథి ఏడీఎంకే నాయకుడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos