విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో ‘గబ్బర్ సింగ్’ లా ఉండొచ్చు కానీ, ఇక్కడ మాత్రం ‘రబ్బర్ సింగ్’ అని మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస రావు శుక్రవారం ఇక్కడ ఎద్దేవా చేశారు.ఇక్కడి పశ్చిమ నియోజక వర్గంలో పర్యటించిన అనం తరం విలేఖరులతో మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిని రెండు చోట్లా ఓడి పోయిన ఆయనకు తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు దీక్షలు చేస్తే మద్దతు తెలిపిన పవన్, రాష్ట్ర రహదారి రవాణా సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి జగన్ ని అభినందించలేకపోయారని విమర్శించారు. ‘రాజధానిలో సినిమా స్టం ట్లు చేయా లని పవన్ చూస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రైతులను రెచ్చగొడుతున్నార’ని మండిపడ్డారు.