హైదరాబాద్: ‘నాకు కొట్లాడటం తెలుసు. దొంగ దెబ్బతీయడం తెలియద’ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ జరిగిన హుజూరాబాద్ శాసనసభ నియోజక వర్గం తెరాస పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘రూ.కోట్లు ఖర్చయినా నేను ఎవరి దగ్గర చేయి చాప లేదు. నమ్మినవారే మోసం చేస్తే బాధ కలుగు తుంది. ప్రజలు ధర్మం తప్పరు. అందువల్లే నేను గత ఎన్నికల్లో గెలిచా. ప్రజలు కూడా ధర్మం తప్పి ఉంటే నేను గెలిచే వాడిని కాదు. నమ్మక ద్రోహం చేసేవారు ఎవరుకూడా బాగుపడర’ని ఆక్రోశించారు. గతంలో గులాబీ ఓనర్లం తామే అంటూ ఈటెల రా జేం దర్ చేసిన వ్యాఖ్యలు తెరాసలోనే కాక తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.