ముంబై : హీరోయిన్ సొనాలి బింద్రేను క్యాన్సర్ మహమ్మారి కాటేసినా పడి లేచిని కెరటంలా మామూలు స్థితికి వచ్చి క్యాన్సర్ పీడితుల్లో పోరాడగలమన్న ధైర్యాన్ని నింపింది. ఒంటరిగా ఏడ్చిన తర్వాత తన లాంటి వారికి మాటలతో ఉపశమనాన్ని కలిగిం చారు. బుధ వారం ఆమె పుట్టినరోజు. గత పుట్టిన రోజు కన్నా ముందు పోస్టు చేసిన ఫొటోలో తను దీనంగా చూస్తున్న కళ్లతో బాధాతప్త హృదయంతో కనిపిస్తుంది. ‘నేను పోరాడటానికి, నాకు వచ్చిన క్యాన్సర్‌ను నయం చేయడానికి నాతో పాటు ఎందరో నిలబడ్డారు. వారికి కృతజ్ఞతలు. ఇక జీవితంలో ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. అందులో నా జుట్టు ఒకటి అని తను జుట్టు కత్తిరించుకుంటున్న ఫొటోను పెట్టింది. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక గుండుతో, మేకప్ లేకుండా ఇండియాకు తిరిగొచ్చిన సొనాలీ ప్రసన్న వదనంతో ఉన్న ఫొటోను పెట్టారు. ‘పారాచ్యూట్ ఆయిల్ యాడ్ తర్వాతే నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. జీవితంలో ఎన్నో కోల్పోతామని అందులో జుట్టు కూడా ఒకటి. దాని కోసం ఆలోచించడం బుద్ధి తక్కువ పని’ అని ధైర్యం చెప్పుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్నామనిపించుకోవడం కంటే క్యాన్సర్ మేలు. అని అభిప్రాయపడింది.