కోల్‌కతా బ్రిగేడ్ గ్రౌండ్స్‌లో చారిత్రాత్మక సభ జరిగిందని, దేశ ప్రజల్లో కోల్‌కతా సభ ఓ భరోసా ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్‌కతా సభ నిరంకుశ పాలన అంతానికి నాంది పలికిందన్నారు. అమరావతిలో దానికి ధీటైన సభ నిర్వహిస్తామన్నారు. 22 పార్టీల నేతలు అమరావతి సభకు వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం తిరోగమనం చెందిందని, నెగిటివ్ లీడర్‌గా మోదీ మారారని విమర్శించారు. మోదీ పాలనలో అభివృద్ధి స్తంభించిందని చంద్రబాబు ఆరోపించారు.