న్యూఢిల్లీ: భారత త్రిదళాధిపతి(సీడీఎస్)గా నియమితులైన జనరల్ బిపిన్ రావత్ జనవరి 1న ఆ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. పదాతి దళపతి అయిన ఆయన మంగళ వారం పదవీ విరమణ చేశారు. ఇక్కడి జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించిన తర్వాత సౌత్ బ్లాక్లో పదాతిదళపతిగా చివరి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తన వారసుడు జనరల్ మనోజ్ నరవణేను అభినందించారు. రావత్ మూడేళ్ల పాటు లేదా ఎక్కువంటే 65 ఏళ్లు వచ్చే వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. 2016 డిసెంబరు 31న పదాతి దళపతిగా బాధ్యతల్ని చేపట్టారు.