హిందూ సంప్రదాయంపై పాక్ మాజీ క్రికెటర్ అక్కసు..

  • In Sports
  • December 30, 2019
  • 212 Views
హిందూ సంప్రదాయంపై పాక్ మాజీ క్రికెటర్ అక్కసు..

భారతదేశంపై,హిందూ సంప్రదాయాలపై పాకిస్థాన్‌లో ఎంతటి వివక్షత ఉందో మరోసారి తేటతెల్లమైంది.తన కూతురు హిందూ సంప్రదాయాన్ని ఆసక్తి గమనించి పాటించడానికి ప్రయత్నింనందుకు పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రీది టీవీని పగులగొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడట.ఈ విషయాన్ని స్వయంగా అఫ్రీదీనే వెల్లడించాడు. భారత క్రికెటర్లన్నా, భారతదేశమన్నా వ్యతిరేకత భావనలు ఉన్నవారిలో అఫ్రిదీ కూడా ఉంటాడు. తాజాగా హిందూమతంపై అతడికి ఎంత అక్కసు ఉందో తెలిపే ఘటన వెల్లడైంది. ఓసారి అఫ్రిది కుమార్తె భారత టీవీ చానల్ చూస్తూ అందులో హారతి ఇవ్వడాన్ని ఆసక్తిగా గమనించింది.అంతేకాదు, తాను కూడా పళ్లెం తీసుకుని హారతి ఇవ్వడాన్ని అనుకరించింది. హిందూ సంప్రదాయాన్ని తన కుమార్తె అనుకరించడాన్ని అఫ్రిది భరించలేకపోయాడు. పట్టలేని ఆగ్రహంతో టీవీ పగులగొట్టేశాడట! ఘనకార్యం గురించి అఫ్రిదీనే స్వయంగా వెల్లడించాడు. టీవీ షోలో అఫ్రిది విషయం చెప్పగా, అక్కడున్న ప్రేక్షకులు అదేదో గొప్ప పని అయినట్టు పగలబడి నవ్వారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos