కరీనాపై విరుచుకుపడుతున్న నెటిజన్లు..

  • In Film
  • December 29, 2019
  • 146 Views
కరీనాపై విరుచుకుపడుతున్న నెటిజన్లు..

బాలీవుడ్‌ ప్రముఖ నటి కరీనాకపూర్‌పై నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు.నాలుగు రోజుల క్రితం తన కొడుకు తైమూర్‌ అలీఖాన్‌తో కలసి బాంద్రాలోని మౌంట్‌మేరీ చర్చ్‌కు వచ్చిన కరీనా అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లడానికి కారువద్దకు వెళుతోంది.ఈ సమయంలో వీధుల్లో భిక్షమెత్తుకుంటున్న ఓ బాలిక కరీనా దగ్గరకు వచ్చి సహాయం చేస్తుందేమోనని ఎదురు చూడసాగింది.ఈ క్రమంలో కరీనా వెళుతుండగా కాలును గట్టిగా పట్టుకుంది.అయినప్పటికీ పట్టించుకోని కరీనా ముందుకు వెళ్లిపోగా ఇది గమనించిన అక్కడే ఉన్న మహిళ పోలీసులు బాలికను దూరంగా నెట్టేసింది.ఈ ప్రవర్తనతో అందరిచేత ఛీ అనిపించేలా చేసారని నెటిజన్ల చివాట్లు పెడుతున్నారు. నెటిజన్లు కరీనా ని ఉద్దేశిస్తూఒక చిన్న పేద అమ్మాయిని పట్టించుకోలేని మానవత్వం లేకపోతే, లక్షల సంపాదించిన, ఎంత స్టార్డమ్ ఉన్న వృధానే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీసం పేదపిల్ల వైపు చూసి నవ్వినా, చిట్టి తల్లి ఆనందపడేది. తైమూర్ కంటే సంవత్సరం పెద్ద ఉంటుందేమో బాలిక వయసు. ఇదే పేదవాళ్లకు, ధనవంతులకు ఉన్న తేడా అని నెటిజన్లు అంటున్నారు. ఏదేమైనా చిత్రం 2019 లో అత్యంత బాధాకరమైనది చెప్పుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos