అన్నీ మూసుకుని ఆంధ్రులందరి మాట విందాం..

అన్నీ మూసుకుని ఆంధ్రులందరి మాట విందాం..

రాజధాని విషయంలో ప్రజల మాట వినాలే తప్ప, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మాట్లాడరాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పీవీపీ, విజయవాడ ఎంపీ కేశినేని నానిపై సెటైర్లు వేశారు మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టిన పీవీపీ, “రోజమ్మ మొదలుకుని ఎందరో నాయకులని అణిచివేద్దామని, మీ చంద్రన్న చేయని ప్రయత్నం లేదు బ్రదరూ సలహా ఏదో మీ బాస్‌కి బాగా వర్తిస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభీష్టం మేరకు వారి రాజధాని ఉంటుంది. నువ్వు నేను అన్ని మూసుకొని ఆంధ్రులందరి మాట విందాం కేశినేని నానిఅని అన్నారు. పీవీపీ ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని చెప్తూ రాజధాని అమరావతి విషయంలో జగన్ అన్నాప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో కలిసి పోయారు. ప్రజా ఉద్యమాలను పోలీసులే కాదు ఎవరూ అణచలేరు అమరావతి నుంచి రాజధాని మార్చి నీ గొయ్యి నువ్వు తవ్వుకోవద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు.పదవుల కోసం జీ హుజూర్ నీ కాళ్ళు మొక్కుతా అనే ప్రజాప్రతినిధులు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వుండటం మన కర్మ అంటూ ట్వీట్ చేశారు కేశినేని నానీ. అమరావతి నుంచి రాజదాని మారుస్తున్న మన జగన్ అన్న .. పిచ్చి తుగ్లక్ కంటే 20 రెట్లు పిచ్చోడు అని అంటూ పేర్కొన్న కేశినేని నానీ జగన్ తీరుపై విరుచుకుపడ్డాడు.దీనికి కౌంటర్‌గానే పీవీపీ ఈ ట్వీట్‌ చేశాడని తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos