వాషింగ్టన్: నూతన పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టికతో కలిపి అమలు చేయడం భారత్లోని ముస్లిం వర్గాన్ని ప్రభావితం చేయనుందని అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్ (సీఆర్ఎస్) అభిప్రాయపడింది. సంబంధిత నివేదికను సభ్యులకు అందించింది. భారత చరిత్రలో తొలి సారిగా మతం ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఇస్తున్నారని పేర్కొంది. యూఎస్ కాంగ్రెస్కు చెందిన ఈ స్వతంత్ర్య అధ్యయన విభాగం. ప్రాముఖ్యత సంతరించుకున్న దేశీయ, అంతర్జాతీయ అంశాలపై అధ్యయనం చేసి సభ్యులకు నివేదికలు సమర్పిస్తుంటుంది. వీటిని కాంగ్రెస్ అధికారిక నివేదికలుగా పరిగణించదు. 1955 పౌరసత్వ సవరణ చట్టానికి పలు సార్లు సవరణలు చేసారు. ఎప్పుడూ మతాన్ని ప్రాతిపదికగా తీసుకోలేదు. తాజా సవరణ భారత రాజ్యాంగంలో అధికరణ 14, 15ని సవాల్ చేసేలా ఉంది. దీనికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేసింది.